2005కు ముందు ముద్రించిన కరెన్సీ నోట్లు ఇక చెల్లవు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

2005కు ముందు ముద్రించిన కరెన్సీ నోట్లు ఇక చెల్లవు!

2005కు ముందు ముద్రించిన కరెన్సీ నోట్లను మార్చుకునే గడువు ఈరోజుతో ముగిసింది. ఈ మేరకు ఆర్బీఐ ఒక ప్రకటన చేసింది. 2005కు ముందు ముద్రించిన నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ గతంలోనే తెలిపింది. 2005కు ముందు నోట్లను బ్యాంకులో ఇచ్చి అంతే విలువైన నోట్లను తీసుకోవాలని ప్రజలకు సూచనలు కూడా చేసింది. గత ఏడాది చివరి వరకున్న గడువును మరో ఆరు నెలలు పొడిగించటం, అది కూడా నేటితో ముగియడం జరిగింది. ఈ నోట్లను ఇప్పటికీ మార్చుకోని వారుంటే దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ బ్రాంచ్ లను సంప్రదించాల్సిందిగా కోరింది. అహ్మదాబాద్, బెంగళూరు, బెల్లాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, కాన్పూర్, కోల్ కతా, లక్నో, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం, కొచ్చి ప్రాంతాల్లో ఉన్న ఆర్బీఐ ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది. కాగా, 2005కు ముందు ముద్రించిన నోట్లను, ఆ తర్వాతి సంవత్సరాల్లో ముద్రించిన నోట్లను గుర్తించడం చాలా సులభం. 2005 తర్వాత ముద్రించిన కరెన్సీకి వెనుక వైపు కింది భాగంలో ఏ ఏడాది ఆ కరెన్సీని ముద్రించారో ఆ వివరాలు ఉంటాయి. అదే, 2005 కు ముందు ముద్రించిన కరెన్సీలో ఆ విధంగా ఉండదు.

More Telugu News