అంతర్జాతీయ ‘ఎర్ర’ స్మగ్లర్లు విశాల్, సాహూ అరెస్ట్!... చెన్నైలో పట్టేసిన చిత్తూరు పోలీసులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంతర్జాతీయ ‘ఎర్ర’ స్మగ్లర్లు విశాల్, సాహూ అరెస్ట్!... చెన్నైలో పట్టేసిన చిత్తూరు పోలీసులు!

ఎర్రచందనం అక్రమ రవాణాలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన స్మగ్లర్లు విశాల్, సాహు ఎట్టకేలకు పోలీసులకు చిక్కిపోయారు. టాస్క్ ఫోర్స్ పేరిట ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన పోలీసు, అటవీ శాఖల సంయుక్త బృందాలు జరుపుతున్న విస్తృత దాడుల నేపథ్యంలో ఏపీని వదిలి పరారైన విశాల్, సాహు చెన్నైలోని ఓ పారిశ్రామిక వాడలో తలదాచుకుంటూ గుట్టుగా ఎర్రచందనాన్ని దేశం సరిహద్దులు దాటిస్తున్నారు. ఈ క్రమంలో వారికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించిన చిత్తూరు పోలీసులు చెన్నైకి వెళ్లి వారు తలదాచుకున్న పారిశ్రామిక వాడపై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో విశాల్, సాహులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి సుమారు 7 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News