Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈడీ అటాచ్ తో వైఎస్ జగన్ బెంబేలు!... 3 గంటల పాటు జ్యోతిష్కులతో మంతనాలు!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ‘రాయలసీమ స్ట్రాంగ్ మ్యాన్’గా నెటిజన్లు పిలుచుకుంటారు. ఇటీవల జగన్ పేరును సెర్చి చేసిన అత్యధికులు ఈ పేరుతోనే నెట్ లో ఆయనను చేరుకున్నారు. అయితే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మొన్న ఒకే దఫాలో రూ.750 కోట్ల మేర ఆస్తులను అటాచ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం ఆయనను బెంబేలెత్తిస్తోంది. మొన్న ఇఫ్తార్ విందులో ఉండగా... ఈడీ అటాచ్ మెంట్ విషయం తెలియడంతో ఒక్కసారిగా జగన్ ముఖ కవళికలు మారిపోయాయి. తాజాగా ఆయన ‘జ్యోతిష్యం’ బాట పట్టారు. గడచిన ఎన్నికల్లో ఓటమి తర్వాత జ్యోతిష్కులతో భవిష్యత్తు చెప్పించుకున్న జగన్... 2016 జూన్ లో తనకు మంచి రోజులని తెలుసుకున్నారు. అందుకే, 2019 దాకా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి ప్రజలు అధికారం కట్టబెట్టినా... మరో రెండేళ్లలో అధికారం మనదేనంటూ ఆయన పదే పదే చెప్పుకొచ్చారు. అయితే 2016 జూన్ వచ్చింది. వెళ్లింది కూడా. అయితే జగన్ కు మంచి రోజులు కాదు కదా... మరింత గడ్డు రోజులొచ్చాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మొన్నటిదాకా మూడు దఫాలుగా జరిగిన ఆస్తుల అటాచ్ మెంట్ లో జప్తు అయిన మొత్తం ఆస్తుల విలువ రూ.500 కోట్లు దాటలేదు. అయితే మంచి రోజులు వస్తాయని జ్యోతిష్కులు చెప్పిన ఈ జూన్ లోనే జరిగిన నాలుగో విడత అటాచ్ మెంట్ లో ఈడీ ఏకంగా రూ.750 కోట్ల ఆస్తులను అటాచ్ చేయడంతో జగన్ షాక్ తిన్నారట. ఈ క్రమంలో ఆయన మరోమారు జ్యోతిష్కులతో మంతనాలు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. నిన్న తన లోటస్ పాండ్ నివాసానికి జ్యోతిష్కులను రప్పించిన జగన్... వారితో దాదాపుగా 3 గంటల పాటు తన భవిష్యత్తుపై మంతనాలు జరిపారట. ఈ కష్టాల నుంచి గట్టెక్కాలంటే కొన్ని దోష నివారణ చర్యలు చేపట్టక తప్పదని జ్యోతిష్కులు ఆయనకు సూచించినట్లు వార్తలు వినవస్తున్నాయి. జ్యోతిష్కులతో మంతనాల నేపథ్యంలో నిన్న ఆయన తనను కలిసేందుకు వచ్చిన ఏ ఒక్క ఎమ్మెల్యేకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వలేదట.

More Telugu News