కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన
కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకుని ఏర్పడిందని తెలిపారు. దీని ప్రభావంతోనే మరో అల్పపీడనం ఏర్పడే సూచన కనిపిస్తోందని పేర్కొన్నారు. రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని మూడురోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.