Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రైతులను రూ. 2 కోట్లకు మోసం చేసి... పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయిన ప్రభాకర్ శర్మ

రైతుల వద్ద మిరపకాయలు కొనుగోలు చేసి, వారికి చెల్లించాల్సిన రూ. 2 కోట్లను ఎగ్గొట్టిన కేసులో ఐదు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రభాకర్ శర్మ, పోలీసులకూ టోకరా ఇచ్చాడు. ప్రకాశం జిల్లా పర్చూరు పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. విచారణ నిమిత్తం ఆయన్ను పోలీసులు స్టేషన్ లో ఉంచగా, ఈ తెల్లవారుఝామున తప్పించుకున్నాడు. పోలీసుల వైఫల్యం కారణంగానే ప్రభాకర్ పారిపోయాడని రైతులు విమర్శిస్తున్నారు. ప్రభాకర్ పారిపోవడంపై మరో కేసును పోలీసులు నమోదు చేయగా, ఉన్నతాధికారులు ఘటనపై సీరియస్ అయ్యారు. దీనిపై విచారణకు ఆదేశించిన ప్రకాశం ఎస్పీ, బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

More Telugu News