నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వండి... లేకుంటే భూములు తిరిగి ఇవ్వండి!: కోదండరాం డిమాండ్
తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం ప్రభుత్వ తీరుపై మరోసారి గళం విప్పారు. ఈరోజు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరులో జెన్కో పవర్ప్లాంట్ కోసం ప్రభుత్వం రైతుల నుంచి తీసుకున్న భూములను ఆయన పరిశీలించారు. భూములు కోల్పోయిన రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జెన్కో పవర్ప్లాంట్ పనులు వెంటనే చేపట్టాలన్నారు. అలాగే భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ప్రభుత్వం తీసుకున్న భూముల్ని తిరిగి రైతులకు ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు.