తిరుపతి విద్యార్థినిపై దాడి కేసులో నిందితులను రక్షించే యత్నంలో అలిపిరి సీఐ... సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుపతి విద్యార్థినిపై దాడి కేసులో నిందితులను రక్షించే యత్నంలో అలిపిరి సీఐ... సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ

తిరుపతిలో చంద్రిక అనే విద్యార్థినిపై జరిగిన ప్రేమోన్మాది దాడి ఘటన విషయంలో నగరంలోని అలిపిరి సీఐ చిక్కుల్లో పడ్డారు. ఈ ఘటనలో యశ్వంత్, నవీన్ అనే ఇద్దరు యువకులపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. తొలుత ఈ ఘటనలో కేసు నమోదు చేసేందుకు అలిపిరి సీఐ తాత్సారం చేశారని, నిందితులను కాపాడేందుకే ఆయన యత్నించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో రంగంలోకి దిగిన డీఐజీ ప్రభాకరరావు కేసుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. నిందితులను కాపాడేందుకు సీఐ యత్నించిన మాట వాస్తవమేనన్న ప్రాథమిక సమాచారంతో ప్రభాకరరావు దీనిపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి ఈస్ట్ డీఎస్పీ మురళికృష్ణకు డీఐజీ ఈ విచారణ బాధ్యతలను అప్పగించారు. విచారణ నివేదిక ఆధారంగా అలిపిరి సీఐపై కఠిన చర్యలు తప్పవన్న వాదన వినిపిస్తోంది.

More Telugu News