తెలంగాణలో ప్రాజెక్టుల పేరిట అతిపెద్ద కుంభకోణం నడుస్తోంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణలో ప్రాజెక్టుల పేరిట అతిపెద్ద కుంభకోణం నడుస్తోంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణలో ప్రాజెక్టుల పేరిట అతిపెద్ద కుంభకోణం నడుస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన పర్యటించి, పాలమూరు ఎత్తిపోతల ముంపు బాధితులను పరామర్శించారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ నేతలు దామోదర రాజనర్సింహ, డీకే అరుణ, చిన్నారెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరివేన జలాశయం ముంపు బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రైతుల పట్ల ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, కమిషన్లు, కాంట్రాక్టుల కోసమే ప్రాజెక్టులు కడుతోందని ఆరోపించారు.

More Telugu News