డీ గ్యాంగ్ బెదిరింపుల ఎఫెక్ట్!... హిందూ మహాసభ చీఫ్ కు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ!
హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి గుర్తున్నారా? ఇటీవల ముంబైలో జరిగిన వేలంలో అండర్ వరల్డ్ డాన్, భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంకు చెందిన కారును దక్కించుకుని, దానిని తగులబెట్టిన వ్యక్తిగా ఆయన వార్తల్లోకెక్కారు. ఈ నేపథ్యంలో చక్రపాణిని మట్టుబెడతామంటూ ఇప్పటికే దావూద్ గ్యాంగ్ (డీ- కంపెనీ) పలుమార్లు బెదిరింపులకు దిగింది. తాను ప్రకటించిన మేరకు డీ గ్యాంగ్ నలుగురు కిరాయి హంతకులను రంగంలోకి దింపింది. అయితే తనకు వచ్చిన బెదిరింపులను చక్రపాణి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చక్రపాణిని హత్య చేసేందుకు రంగంలోకి దిగిన నలుగురు కిరాయి హంతకులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో చక్రపాణికి ముప్పు పొంచి ఉందని భావించిన కేంద్రం ఆయనకు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది.