హైకోర్టు విభజన అంశంలో ఎలా ముందుకు పోదాం..?: టీఆర్ఎస్ పార్లమెంటరీ, ఎల్పీ భేటీ
హైకోర్టు విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టులపై హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న ఈ సమావేశంలో జిల్లాల విభజనపై పార్టీ నేతలు తమ అభిప్రాయాలు వెల్లడించనున్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై, హైకోర్టు విభజన, న్యాయమూర్తుల సస్పెన్షన్ అంశాలపై ముందుకు వెళ్లే దిశగా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. హైకోర్టు విభజన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే అంశంపై చర్చించనున్నారు. భేటీలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.