Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నారాయణ స్కూల్ బస్సులో మంటలు!... స్థానికుల అప్రమత్తతతో తప్పిన పెను ముప్పు!

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ కార్పొరేట్ పాఠశాలగా పేరుగాంచిన నారాయణ స్కూల్ బస్సుకు నేటి ఉదయం పెద్ద ప్రమాదమే తప్పింది. పాఠశాలకు పిల్లలను తీసుకొచ్చేందుకు వెళ్లిన ఆ స్కూల్ కు చెందిన ఓ బస్సులో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. అయితే ఈ మంటలను చూసిన స్థానికులు వేగంగా స్పందించడంతో పెద్ద ముప్పే తప్పింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో నేటి ఉదయం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగే సమయానికి బస్సుల్లో పిల్లలు ఎవరూ లేకపోవడంతో పాటు మంటలు మరింత మేర విస్తరించకముందే స్థానికులు వేగంగా స్పందించడంతో ప్రమాదం తప్పింది. బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు.

More Telugu News