Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రేమించకపోతే యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్న యువకుడి అరెస్టు

తనను ప్రేమించకపోతే యాసిడ్ పోస్తానని బెదిరించిన ఒక యువకుడిని ఖమ్మం జిల్లా అశ్వారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా నివాసముంటున్న ఒక యువతిని ప్రేమించమంటూ ఒక యువకుడు కొద్దిరోజులుగా వెంటపడుతున్నాడు. ఈ విషయమై ఆమె స్పందించకపోవడంతో యాసిడ్ దాడి చేస్తానని సదరు యువకుడు బెదిరించాడు. ఆ యువతి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

More Telugu News