Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆరా?... కేజ్రీవాలా?: సదానందగౌడ ఎద్దేవా

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లా వ్యవహరిస్తున్నారని, దాని వల్ల ఉపయోగం ఉండదని ఆయన తెలుసుకోవాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానందగౌడ వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాల హైకోర్టు విభజన కేసు పెండింగ్ లో ఉండగా, కేంద్రం ఏమీ చేయలేదన్న సంగతి కేసీఆర్ కు తెలియదా? అని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తానని కేసీఆర్ మాట్లాడటం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, కనీసం పదేళ్ల పాటు హైకోర్టు హైదరాబాద్ లో ఉండటానికి అవకాశాలను విభజన చట్టం కల్పించిందని ఆయన గుర్తు చేశారు. విడిగా హైకోర్టు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఏపీ సర్కారుదని, ఏపీ ప్రభుత్వం సిద్ధంగా లేనంతవరకూ తామేమీ చేయలేమని అన్నారు. చంద్రబాబు చొరవతోనే హైకోర్టు విడిపోతుందని కేసీఆర్ తెలుసుకోవాలని హితవు పలికారు. వాస్తవాన్ని పక్కనబెట్టి కేజ్రీవాల్ మాదిరిగా, ధర్నాలు, నిరసనలు తెలిపితే తమకేమీ అభ్యంతరం లేదని, అయితే, శాంతిభద్రతల సమస్యలు తప్ప మరేమీ ప్రయోజనం ఉండబోదని సదానందగౌడ అభిప్రాయపడ్డారు.

More Telugu News