: కోహ్లీకి జర్మన్ ఫుట్ బాల్ ప్లేయర్ బహుమతి


టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీకి జర్మన్ ఫుట్ బాల్ ప్లేయర్ టోనీ క్రూస్ ఒక జెర్సీనీ బహుమతిగా పంపాడు. ఈ జెర్సీతో ఫొటోలు దిగిన కోహ్లీ వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా టోనీ క్రూస్ కు ధన్యవాదాలు తెలిపాడు. బహుమతిగా పంపిన 18 నెంబరు జెర్సీపై క్రూస్ సంతకం కూడా ఉంది. కాగా, ఈ నెల 10 నుంచి యూఈఎఫ్ఏ యూరో-2016 ప్రారంభమైంది. ఫుట్ బాల్ అంటే ఎంతో ఇష్టపడే కోహ్లీ ఈ సందర్భంగా 18 నెంబరు జెర్సీ ధరించి ఆటగాళ్లకు 'ఆల్ ది బెస్ట్' చెబుతూ ఇటీవల ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ కు స్పందించిన క్రూస్ త్వరలో ఒక బహుమతి పంపుతానంటూ సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో 18 నెంబర్ జెర్సీనే క్రూస్ కూడా బహుమతిగా కోహ్లీకి పంపాడు

  • Loading...

More Telugu News