నేటి ఉదయం మెట్రో నగరాల్లో రికార్డైన వీడియోలు అన్ని వార్తా ఛానెళ్లలో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ముంబైలో మద్యం మత్తు తలకెక్కిన యువతి, బెంగళూరులో డ్రగ్స్ సేవించిన నైజీరియన్ యువతి పోలీసులపై విరుచుకుపడ్డ వీడియోలు దర్శనమిచ్చాయి. తాజాగా వార్తా ఛానెళ్లలో ప్రసారమైన మూడో వీడియో... చూస్తేనే వణుకు పుట్టించేలా ఉంది. ఈ వీడియో కూడా ముంబైకే చెందినది కావడం గమనార్హం. ముంబై ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో రైళ్లదే కీలక భూమిక. కళ్లు మూసి తెరిచేలోగానే మాయమయ్యే వేగంతో దూసుకుపోయే మెట్రో రైళ్లనే వేదికలుగా చేసుకుంటున్న అక్కడి యువత వెర్రి వేషాలేస్తోంది. ఈ తరహా వెర్రి వేషాలేసిన పలువురు టీనేజర్లు ప్రాణాలు కోల్పోయారు కూడా.
తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో... వేగంగా దూసుకెళుతున్న మెట్రో రైలు టాప్ పై నిలబడ్డ ఓ యువకుడు ఎదురుగా వస్తున్న విద్యుత్ స్తంభాలను, వాటి తీగలను తప్పించుకుంటూ ముందుకు సాగాడు. స్తంభం దగ్గరికి రాగానే కాస్తంత వంగడం, దానిని దాటేయగానే మళ్లీ నిటారుగా నిలబడుతూ ఆ యువకుడు చేసిన ఫీట్ ఒళ్లు జలదరించేలానే ఉంది. వేగంగా పరుగు పెడుతున్న ఆ రైలుపై అప్పుడప్పుడు పట్టు తప్పుతున్నట్లు కనిపించినా, ఆ యువకుడు కింద పడకుండా తమాయించుకుని నిలబడ్డాడు. ప్రమాదకరమైన ఈ తరహా విన్యాసాలు విచ్చలవిడిగా జరుగుతున్నా, రైల్వే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
More Telugu News
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు