కర్ణాటక మాజీ మంత్రి, అక్రమ గనుల ఘనుడు గాలి జనార్దన్ రెడ్డి పేరు ఏపీలోని కృష్ణా జిల్లాలో కలకలం రేపుతోంది. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయవాది వికాస్ బన్సోడేపై జరిగిన హత్యాయత్నం జనార్దన్ రెడ్డి అనుచరుల పనేనన్న వార్తలు జిల్లావ్యాప్తంగా పెను కలకలం రేపుతున్నాయి. అక్రమ గనుల వ్యవహారంపై వికాస్ బన్సోడే సుప్రీంకోర్టులో జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా వాదనలు వినిపించారన్న కారణంతోనే బన్సోడేపై హత్యాయత్నం జరిగిందని, ఈ దుశ్చర్యకు పాల్పడ్డ ఇద్దరు దుండగులు కూడా జనార్దన్ రెడ్డి అనుచరులేనన్న పోలీసులు ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని నవీన్ మిట్టల్ కాలనీలో నిన్న పోలీసులు కార్డాన్ అండ్ సెర్చి సోదాలు నిర్వహించారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత డీఎస్పీ శ్రవణ్ ఆధ్వర్యంలో ఏకంగా 200 మంది పోలీసులు నవీన్ మిట్టల్ కాలనీని రౌండప్ చేశారు. కాలనీలోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టిన పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అనంతరం నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో భాగంగా సరైన పత్రాలు లేని 16 బైకులు, రెండు ఆటోలు, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
More Telugu News
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు