హైదరాబాదులోని ఉమ్మడి సచివాలయంలో నేడు ఉద్వేగభరిత వాతావరణం చోటుచేసుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ ఉద్యోగులంతా నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి తరలివెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే అమరావతి పరిధిలోని వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ నెల 27లోగా ఏపీ సచివాలయ ఉద్యోగులంతా హైదరాబాదు వీడి అమరావతికి తరలి రావాల్సిందేనని చంద్రబాబు సర్కారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే పలు శాఖల కార్యాలయాలు అమరావతికి తరలివెళ్లాయి. నేటి ఉదయం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సు ఎక్కేందుకు కొన్ని శాఖల ఉద్యోగులు సిద్ధమయ్యారు.
అప్పటిదాకా కలిసి మెలసి ఉన్న తెలంగాణ ఉద్యోగులను వీడడం వారిని కలచివేసింది. తీవ్ర ఉద్వేగానికి గురైన కొందరు మహిళా ఉద్యోగులు తమ స్నేహితులైన తెలంగాణ ఉద్యోగులను హత్తుకుని వెళ్లొస్తామని చెప్పారు. అలాగే తమ ప్రియ నేస్తాలు దూరమవుతున్న వైనం తెలంగాణ ఉద్యోగులను కూడా ఆవేదనకు గురి చేసింది. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల మహిళా ఉద్యోగులు అక్కడ కన్నీటి పర్యంతమయ్యారు. అయినా ప్రభుత్వ ఆదేశాలు పాటించక తప్పని నేపథ్యంలో భారమైన హృదయాలతోనే ఏపీ ఉద్యోగులు బస్సెక్కగా, అంతకంటే భారమైన మనసులతో తెలంగాణ ఉద్యోగులు వారికి వీడ్కోలు పలికారు.
More Telugu News
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు