తెలంగాణ రచయితగా, గాయకుడిగా, ప్రజా ఉద్యమ కారుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన గూడ అంజయ్య(61) ఈరోజు కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజిల్ పరిధి రాగన్నగూడెంలోని తన స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన గుండె జబ్బు, పక్షవాతంతో బాధపడుతూ నిమ్స్ లో చికిత్స పొందుతోన్న సంగతి తెలిసిందే.
గూడ అంజయ్య 1955లో ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపురంలో జన్మించారు. ఆయన రాసిన "ఊరు మనదిరా" పాట 16 భాషలలో అనువాదమయింది. "నేను రాను బిడ్డో మన ఊరి దవాఖాన"కు అనే పాట తెలంగాణలో సర్కారీ దవాఖానాల దుస్థితిని ఎండగట్టింది. ఆయన రాసిన ఇటువంటి పాటలు ఎన్నో తెలంగాణ వాసుల గొంతుల్లో ప్రతీరోజూ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.
గూడ అంజయ్య తెలంగాణ సాంస్కృతిక సంఘ నాయకునిగా పనిచేశారు. నలభై ఏళ్లుగా తెలంగాణ సాహితీ ప్రపంచంలో సేవలందించిన అంజయ్య కలకాలం నిలిచిపోయే పాటలు ఎన్నో రాశారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆయన రాసిన పాటలు పోరాటానికే కొత్త ఊపిరులూదాయి. తెలంగాణ మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఉత్తమ కవి అవార్డును ఆయన అందుకున్నారు.
More Telugu News
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు