ఆయనో మాజీ ఎమ్మెల్యే. ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు. యువకుడిగా ఉండగానే రాజకీయాల్లోకి వచ్చేసిన సదరు నేత... ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి విపక్ష వైసీపీలో చేరారు. అంతేనా ఇటీవలే ఓ యువతిని పెళ్లి కూడా చేసుకున్నారు. తనను నమ్మి వచ్చిన ఆ యువతిని బాగా చూసుకోవాల్సింది పోయి వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. దీంతో ఎన్నో ఆశలతో ఆ నేతాశ్రీ ఇంట కాలు మోపిన ఆ యువతి షాక్ తిన్నది. మాజీ ఎమ్మెల్యేగారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
వివరాల్లోకెళితే... ఇప్పటికే కాల్ మనీ కేసులో నిందితుడిగా బుక్కైన కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ రెండు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే కాల్ మనీ కేసు నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన సతీమణి నిన్న రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మురళీకృష్ణపై వేధింపుల కేసు నమోదు చేశారు.
More Telugu News
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు