భారత్ కు చెందిన ఒక పనిమనిషి కిడ్నాప్ అనంతరం ఆఫ్ఘానిస్థాన్...విదేశీయుల రక్షణ కోసం కఠిన చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం దేశంలో నివాసం ఉంటున్న విదేశీయులకు హెచ్చరికలు జారీ చేసింది. కాబూల్ పోలీస్ నేర విచారణ విభాగం చీఫ్ ఫ్రాయిదున్ ఒబైదీ చేసిన వ్యాఖ్యల ప్రకారం... ఆఫ్ఘాన్ లోని విదేశీయులు, విదేశీయుల కార్యాలయాలపై టెర్రరిస్టులు కన్నేశారు. దీంతో విదేశీయులకు కిడ్నాప్ ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీయులు సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా బయటకు వెళ్లవద్దు. తప్పని సరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే...భద్రతా బలగాలు, పోలీసుల సహాయం తీసుకోవాలి. లేని పక్షంలో విదేశీయులు ఇంట్లోనే ఉండాలని స్పష్టం చేశారు.
అలా కాదని ఒంటరిగా బయటకు వెళ్తే...కిడ్నాప్ కు గురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని వారు తెలిపారు. అయితే, ఈ ప్రకటనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఇలాంటి ప్రకటనలు చేస్తే, ఇక ప్రజలను రక్షించేది ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ప్రకటనలతో తమను నిత్యం ఇబ్బందులపాలు చేస్తున్నారని, సెక్యూరిటీ, భద్రత అంటూ ఎక్కడికి వెళ్లినా ఆపి గంటలకు గంటలు పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నారని శ్రీలంకకు చెందిన నయేలా విక్రమసూరియ మండిపడ్డారు.
More Telugu News
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు