ముస్లింలపై మరోసారి విషం చిమ్మిన సాధ్వీ ప్రాచీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముస్లింలపై మరోసారి విషం చిమ్మిన సాధ్వీ ప్రాచీ

ముస్లింలపై బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రాచీ మరోసారి విషం చిమ్మారు. ఉత్తరాఖండ్ లో మతఘర్షణలతో అట్టుడుకుతున్న రూర్కీలో ఆమె మాట్లాడుతూ, 'కాంగ్రెస్ ముక్త భారత్' మిషన్ పూర్తి కావచ్చిందని, ఇప్పుడు 'ముస్లిం ముక్త భారత్'ను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ముస్లిం ముక్త భారత్ కు ఇదే సరైన తరుణమని ఆమె సూచించారు. వచ్చే ఏడు జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆదిత్యనాథ్ ను ప్రకటిస్తే విజయం తమదేనని ఆమె పేర్కొన్నారు. షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ లు పాకిస్థాన్ అనుకూలురంటూ ఆమె మండిపడ్డారు. అమీర్ చిత్రం 'దంగల్'ను హిందువులు చూడవద్దంటూ ఆమె పిలుపునిచ్చారు. వారిద్దరి సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇప్పుడు వీరు హిందూ జపం చేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

More Telugu News