కోదండరాం దారెటు?... మరికాసేపట్లో జేఏసీ కీలక భేటీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోదండరాం దారెటు?... మరికాసేపట్లో జేఏసీ కీలక భేటీ!

తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం రెండు రోజుల క్రితం ప్రారంభించిన నిరసన బాటలోనే పయనిస్తారా? లేక కేసీఆర్ సర్కారు పనితీరును మరింత కాలం పాటు పరిశీలిద్దామని సంధి బాట పడతారా? అన్న విషయం మరికాసేపట్లో తేలిపోనుంది. ఈ మేరకు నేటి ఉదయం 9 గంటలకు హైదరాబాదులో జేఏసీ కీలక భేటీ జరగనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి రెండేళ్లవుతున్న నేపథ్యంలో ఓ వైపు ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుండగా.. ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారంటూ కోదండరాం నిరసన గళం విప్పిన సంగతి తెలిసిందే. కోదండరాం వ్యాఖ్యలపై వేగంగా స్పందించడమే కాకుండా తెలంగాణ మంత్రులంతా కలిసి ఆయనపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ క్రమంలో నేడు జరగనున్న జేఏసీ భేటీలో కోదండరాం తన భవిష్యత్తు కార్యాచరణను నిర్దేశించుకుంటారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ భేటీపై ఇటు తెలంగాణలోనే కాకుండా అటు ఏపీలోనూ ఆసక్తి నెలకొంది.

More Telugu News