9,10 తేదీల్లో కొన్ని గంటలపాటు మూతపడనున్న పీవీ ఎక్స్ ప్రెస్ హైవే
హైదరాబాద్ లోని పీవీ ఎక్స్ ప్రెస్ హైవే 9,10 తేదీల్లో కొన్ని గంటల పాటు మూతపడనుంది. హైవేపై సెంట్రల్ లైన్ రోడ్డు మార్కింగ్, రెయిలింగ్ తో పాటు క్రాష్ బారియర్ లకు రంగులు వేసే పనులు చేపడుతున్న కారణంగా ఈ నెల 9,10 తేదీల్లో రాత్రి పదకొండు గంటల నుంచి మర్నాడు ఉదయం 5 గంటల వరకు రాకపోకలను నిలిపివేయనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించి తమకు సహకరించాలని కోరారు.