ఫేస్ బుక్ వ్యసనపరుల కోసం వెలుస్తున్న డీ అడిక్షన్ సెంటర్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫేస్ బుక్ వ్యసనపరుల కోసం వెలుస్తున్న డీ అడిక్షన్ సెంటర్లు

సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ తీవ్రమైన వ్యసనంగా మారుతోంది. ఓ ఫోటో లేదా పొస్టు పెట్టడం.. దానికి వచ్చే లైకులు, కామెంట్లు, షేర్లు చూసుకుని మురిసిపోవడం ఈవేళ చాలామందికి మామూలైపోయింది. అయితే ఈ లైకులు, కామెంట్లు, షేర్ల మోజులో గంటలకు గంటలు ఫేస్ బుక్ లో గడిపేస్తున్నారు. మనదేశంలో ఇది వ్యసనంగా మారుతున్న వారు పరిమిత సంఖ్యలో ఉన్నప్పటికీ, పాశ్చాత్య దేశాల్లో వీరి సంఖ్య లెక్కకు మిక్కిలిగా వుంది. వారి వ్యక్తిగత జీవిత విశేషాలు కూడా ఫేస్ బుక్ గోడలమీద కనపడుతుండడంతో వారు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ నేపధ్యంలో ఫేస్ బుక్ భయంకరమైన డ్రగ్ ను మించిన మత్తులా కమ్మేస్తోంది. వారిని ఆ మత్తుబారి నుంచి బయటపడేసేందుకు డీ అడిక్షన్ సెంటర్లు వెలుస్తున్నాయి. సాధారణంగా డీ అడిక్షన్ సెంటర్లంటే డ్రగ్ అడిక్షన్ కి గురైన వారిని మార్చే కేంద్రాలు. ఇది డ్రగ్స్ ను మించిన వ్యసనంగా మారుతుండడంతో దీనిని కూడా అక్కడ డీ అడిక్షన్ సెంటర్ అని సంబోధిస్తున్నారు. అల్జీరియాలోని కాన్ స్టాంటిన్ లో తాజాగా ఓ ప్రైవేటు డీ అడిక్షన్ సెంటర్ ను తెరిచారు. అందులో ఆల్కహాల్, డ్రగ్ బాధితులతో పాటు ఫేస్ బుక్ బాధితులకు కూడా చికిత్స చేయబడుతుందని పేర్కొన్నారు. ఈ క్లినిక్ ను ఫేస్ బుక్ బాధితులు బాగా సంప్రదిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

More Telugu News