Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహిళా జర్నలిస్టుపై నోరు పారేసుకున్న కర్ణాటక ఎమ్మెల్యే!

రాజ్యసభకు ఈ నెల 11న జరగనున్న ఎన్నికలకు సంబంధించి కన్నడ నాట ఆసక్తికర రాజకీయం కొనసాగుతోంది. రూ.5 కోట్లిస్తే మా ఓటు మీకేనంటూ తమను సంప్రదించిన వైరి పక్షాల నేతలకు చెప్పిన ఆ రాష్ట్రానికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు స్టింగ్ ఆపరేషన్ కు అడ్డంగా దొరికిపోయారు. ఈ క్రమంలో అక్కడ ఎన్నికలను వాయిదా వేయాలన్న దిశగానూ కేంద్ర ఎన్నికల సంఘం యోచించింది. అయితే పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ఎన్నికలు నిర్వహించేందుకే చివరికి ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ క్రమంలో స్టింగ్ ఆపరేషన్ కు దొరికిపోయిన స్వతంత్ర ఎమ్మెల్యే అశోక్ ఖేనీ ఓ మహిళా జర్నలిస్టుపై నోరు పారేసుకున్నారు. స్టింగ్ ఆపరేషన్ కు సంబంధించిన తనను ప్రశ్నించిన ‘టౌమ్స్ నౌ’ మహిళా జర్నలిస్టుపై ఆయన దుర్బాషలాడారు. ఈ వీడియో కూడా నేషనల్ మీడియాలో వైరల్ గా మారింది.

More Telugu News