: అమితాబ్ పక్కన పాకిస్థానీ నటుడికి ఛాన్స్
పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ బాలీవుడ్ స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో కలసి నటించనున్నాడు. సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్స్‌లో నిర్మించనున్న ‘జుగల్‌బందీ’ మూవీలో అమితాబ్, ఫవాద్ ఖాన్ కలసి గురు, శిష్యులుగా నటించనున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా షూటింగ్ కోసం కథానాయిక ఎంపిక మినహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువు, శిష్యుడి చుట్టూ తిరిగే ఈ సినిమాలో గురువు పాత్రలో అమితాబ్, శిష్యుడి పాత్రలో ఫవాద్ ఖాన్ నటించనున్నారు. ఖూబ్‌సూరత్ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఫవాద్.. బాలీవుడ్‌లో తన పేరును నిలుపుకోవాలని ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఏకంగా బిగ్ బీ పక్కనే నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.