ట్రంప్ టాయిలెట్ పేపర్స్... మేడిన్ చైనా, పాప్యులర్ ఇన్ యూఎస్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ట్రంప్ టాయిలెట్ పేపర్స్... మేడిన్ చైనా, పాప్యులర్ ఇన్ యూఎస్!

అమెరికన్ల ఉద్యోగాలను చైనా లాగేసుకుంటోందని రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై చైనీయులు పగ తీర్చుకున్నారు. ఆయన చిత్రాలను ముద్రించి 'డంప్ విత్ ట్రంప్' అన్న స్లోగన్ తో చైనా తయారీ సంస్థలు టాయిలెట్ పేపర్ ను తయారు చేసి అమెరికా మార్కెట్లో అమ్మకానికి ఉంచగా, ప్రజలు వేలంవెర్రిగా కొనుక్కుపోతున్నారని చైనా ప్రభుత్వ అధీనంలోని క్సిన్హువా న్యూస్ ఏజన్సీ ఈ ఉదయం ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కొనుగోలుదారులు వివిధ రకాల ట్రంప్ హావభావాలున్న టాయిలెట్ పేపర్లను ఎంచుకోవచ్చని కూడా వెల్లడించింది. ట్రంప్ టాయిలెట్ పేపర్ల అమ్మకాలను ఫిబ్రవరి నుంచి ప్రారంభించినట్టు క్వింగ్ డావో వాల్ పేపర్ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. 5000 రోల్స్ తో కూడిన ఆర్డర్లు తమకు 50కి పైగా వచ్చాయని, వీటిల్లో అత్యధికం అమెరికా నుంచి వచ్చాయని తెలిపారు. చైనా ఆన్ లైన్ బిజినెస్ టు బజినెస్ ప్లాట్ ఫాం, అలీబాబా మాధ్యమంగా, 70కి పైగా కంపెనీలు ఈ తరహా టాయిలెట్ పేపర్లను విక్రయిస్తున్నట్టు క్సిన్హువా పేర్కొంది. కాగా, హోల్ సేల్ ధరలో 50 సెంట్లు మాత్రమే ఖరీదయ్యే వీటి ధరలు, ఈబే, అమేజాన్ వరకు వచ్చేసరికి 30 డాలర్ల వరకూ పలుకుతున్నాయి.

More Telugu News