అమెరికాలో బాలయ్య!... ఘన స్వాగతం పలికిన అభిమానులు!
టాలీవుడ్ అగ్ర నటుడు, అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వారం రోజుల అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా నిన్న అమెరికాలోని సియాటెల్ విమానాశ్రయంకు చేరుకున్న బాలయ్యకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి బాలయ్య బస చేయనున్న హోటల్ వరకు పెద్ద సంఖ్యలో కార్లతో ర్యాలీ నిర్వహించిన అభిమానులు బాలయ్యకు మరపురాని రీతిలో స్వాగతం పలికారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాదులో నడుస్తున్న బసవతారకం ఇండో- అమెరికన్ కేన్సర్ ఆసుపత్రిని మరింత ఆధునికీకరించేందుకు నిధుల సేకరణ నిమిత్తం బాలయ్య అమెరికా వెళ్లారు. నిన్న సియాటెల్ లో ఆయన అభిమానులు నిర్వహించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమానికి బాలయ్య హాజరయ్యారు. ఇక ఈ నెల 10న కాలిఫోర్నియాలో అభిమానులు నిర్వహించే తన జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు.