ఏలూరు రా.. నిన్ను చెప్పుతీసుకుని కొట్టకపోతే నేను ప్రభాకర్ నే కాదు!: జగన్ కు చింతమనేని ప్రభాకర్ సవాల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏలూరు రా.. నిన్ను చెప్పుతీసుకుని కొట్టకపోతే నేను ప్రభాకర్ నే కాదు!: జగన్ కు చింతమనేని ప్రభాకర్ సవాల్

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు సవాలు విసిరారు. దెందులూరులో ఆయన మాట్లాడుతూ, జగన్ నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడని అన్నారు. 'జగన్, ఏలూరురా, నిన్ను చెప్పు తీసుకుని కొట్టకపోతే నేను ప్రభాకర్ నే కాదు' అంటూ ఆయన సవాలు విసిరారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా? అని అడిగారు. పధ్ధతిగా మాట్లాడడం నేర్చుకోవాలని ఆయన జగన్ కు హితవు పలికారు.

More Telugu News