పాపం బిపాసా బసు... ఫ్యాన్స్ పెద్ద పరీక్ష పెట్టారు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాపం బిపాసా బసు... ఫ్యాన్స్ పెద్ద పరీక్ష పెట్టారు!

ఏప్రిల్ 30న వివాహం ద్వారా ఒక్కటైన బాలీవుడ్ జంట బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ తాజాగా కపిల్ శర్మ షోలో సందడి చేశారు. ఈ సందర్భంగా అభిమానులు బిపాసా బసుకు పెద్ద పరీక్ష పెట్టారు. షోను సరదాగా నడిపించిన కపిల్ శర్మ...బిపాసాకు ఇంటి పనులు చేయడం వచ్చా? అని అడిగాడు. ఆమె రాదని సమాధానమిచ్చింది. కనీసం సగటు ఇల్లాలు చేసే ఏ పనైనా వచ్చా? అని ప్రశ్నించారు. దీనికి కూడా ఆమె రాదని చెప్పింది. ఆ తర్వాత ఆమెను ఏదైనా అడగవచ్చని ఆ షోకు హాజరైన వారికి కపిల్ సలహా ఇచ్చాడు. దీంతో భర్త షర్టుకు బటన్ ఎప్పుడైనా కుట్టారా? అని అడిగారు. డానికి కూడా ఆమె లేదని చెప్పడంతో, ఇప్పుడు కుట్టమని అన్నారు. అది కూడా తన వల్ల కాదంది. దాంతో కనీసం భర్తకు టై అయినా కట్టమని అడిగారు. పాపం బిపాసా దానికి కూడా పెద్ద ప్రయత్నమే చేసింది. ఎట్టకేలకు ఏదో కట్టాననిపించింది. ఈ విషయంలో బిపాసా పడిన తిప్పలతో, షోకు వచ్చిన అభిమానులు హాయిగా నవ్వుకున్నారు.

More Telugu News