మధుర ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలి: హేమమాలిని
మధుర జవహర్ బాగ్ లోని పార్కు ఘటనపై బీజేపీ మధుర ఎంపీ హేమమాలిని స్పందించారు. తొలుత సినిమా షూటింగ్ ఫోటోలను ట్వీట్ చేసిన హేమా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఆ ఫోటోలను తొలగించి, ఈ హింస ఘటనపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఘటన చాలా తీవ్రమైనదని ఆమె పేర్కొన్నారు. చాలాకాలం క్రితమే పార్కును దురాక్రమణ చేస్తే సమాజ్ వాదీ పార్టీ ఏమీ చేయలేకపోయిందని ఆమె విమర్శించారు. దురాక్రమణను ఖాళీ చేయించడం ఇంత తీవ్రంగా మారుతుందని తాను ఊహించలేదని ఆమె చెప్పారు. జరిగిన ఘటనపై సీబీఐతో విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, ఘటనపై ఆరాతీసేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మను అక్కడికి పంపారు.