యనమలా, మీ మానసికస్థితి బాగుందా?: వైఎస్సార్సీపీ నేత బొత్స
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యనమలా, మీ మానసికస్థితి బాగుందా?: వైఎస్సార్సీపీ నేత బొత్స

సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నేత జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిపై వైఎస్సార్సీపీ నేత బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. ‘యనమల, మీ మానసిక పరిస్థితి బాగుందా? రాష్ట్రం అప్పుల్లో ఉంటే రెండంకెల అభివృద్ధి ఎలా వచ్చింది?’ అని ఆయన ప్రశ్నించారు. మోసం చేసే వారిని ప్రజలు సహించరన్న ఉద్దేశంతోనే జగన్ నిన్న ఆ వ్యాఖ్యలు చేశారన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. నవ్యాంధ్ర రాజధాని భూమలును బినామీలకు అమ్ముకున్నారని, టీడీపీ నేతలు సిగ్గు లేకుండా ద్వంద్వ వైఖరితో మాట్లాడుతున్నారని, టీడీపీ నేతల మానసిక స్థితి బాగుందా? లేదా? అని బొత్స ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికలను కూడా వ్యాపారదృష్టితో చూస్తున్నారని టీడీపీ సీనియర్ నేతలే వ్యాఖ్యానించారని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ‘కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు పేషీ నుంచి ఫోన్ కాల్స్ పై ఏం బాధ్యత వహించారు? అసలు అప్పారావు ఎవరు? అప్పారావు ఎవరితో లాలూచీ పడ్డారు? ఇవన్నీ పక్కన పెట్టారు, ఎవరిపై చర్యలు లేవు. కనీసం, అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారా?’ అని బొత్స ప్రశ్నించారు. ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు మాట్లాడటం లేదని, టీడీపీ నేతలకు వ్యవస్థలపై గౌరవం లేదని బొత్స ఆరోపించారు.

More Telugu News