ముస్లింలకు 'అమ్మ' రంజాన్ కానుక!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముస్లింలకు 'అమ్మ' రంజాన్ కానుక!

తమిళనాడు ప్రజలకు ఇప్పటికే బోలెడన్ని వరాలిచ్చేసిన ముఖ్యమంత్రి జయలలిత, తాజాగా, వచ్చే వారం ప్రారంభమయ్యే రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఖీర్ తిన్నంత తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలోని గుర్తింపు పొందిన 3 వేలకు పైగా మసీదులకు రంజాన్ మాసాంతం ఉచితంగా బియ్యం అందిస్తామని చెప్పారు. అందుకోసం 4,600 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సిద్ధం చేసినట్టు తెలిపారు. మసీదులన్నింటికీ ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలంటూ, అధికారులకు ఆమె ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల మొత్తం నిరంతరంగా విద్యుత్ ను అందించాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా పటిష్ట బందోబస్తు కల్పించాలని కూడా ఆమె ఆదేశించారు. కాగా, 2001లో ఏఐఏడీఎంకే ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తరువాత మసీదులకు ఉచిత బియ్యం పథకం ప్రారంభం కాగా, ఆపై అది ఆగిపోయింది. తిరిగి ఇప్పుడు అదే పథకాన్ని పునరుద్ధరించడం ద్వారా ముస్లిం వర్గాల్లో ఆమె తన పట్టును నిలుపుకోనున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More Telugu News