రేవంత్ రెడ్డిపై మరో కేసు నమోదు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేవంత్ రెడ్డిపై మరో కేసు నమోదు!

టీ టీడీపీ ఫైర్ బ్రాండ్, టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టిన ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఇప్పటికే నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఓ నెల రోజుల పాటు ఆయన జైలులో కూడా ఉండాల్సి వచ్చింది. తాజాగా నిన్న ఆయనపై హైదరాబాదు పోలీసులు మరో కేసు నమోదు చేశారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా నిన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి జేఏసీ నిర్వహించిన జన జాతరకు హైకోర్టు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసిన విద్యార్థి జేఏసీ నిన్న సాయంత్రం నుంచి రాత్రి దాకా జనజాతరను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. విద్యార్థి జేఏసీ ఆహ్వానం మేరకే ఆయన ఈ కార్యక్రమానికి వెళ్లారు. దీంతో హైకోర్టు ఆదేశాల ధిక్కరణ కింద రేవంత్ రెడ్డిపై ఓయూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. రేవంత్ రెడ్డితో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజా సంఘాల నేతలు చెరకు సుధాకర్, యెన్నం శ్రీనివాసరెడ్డి, బెల్లయ్య నాయక్, కార్యక్రమ నిర్వాహకులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News