టెక్నాలజీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్: చంద్రబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టెక్నాలజీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్: చంద్రబాబు

టెక్నాలజీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ దీక్ష సందర్భంగా పలు టీవీ ఛానెళ్లతో ఆయన మాట్లాడుతూ, తనకు ఆది నుంచి టెక్నాలజీ మంచి స్నేహితుడని అన్నారు. టెక్నాలజీని నమ్మడం వల్ల ఎన్నో పనులు సమర్ధవంతంగా పూర్తి చేశానని అన్నారు. ఎంతటి చీకట్లోనైనా అధైర్య పడకుండా, ఆత్మ విశ్వాసంతో అడుగు వేయడం తనకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. సాంకేతికత సాయంతో ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కోవడమే తన బలమని, అలా సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నానని ఆయన చెప్పారు. తన పని తీరును తొందర్లోనే పూర్తిగా చూస్తారని ఆయన తెలిపారు.

More Telugu News