గోకర్ణం బీచ్ లో 'లా' స్టూడెంట్ ప్రాణం తీసిన సెల్ఫీ పిచ్చి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గోకర్ణం బీచ్ లో 'లా' స్టూడెంట్ ప్రాణం తీసిన సెల్ఫీ పిచ్చి!

సెల్ఫీల మోజులో పడి ముందూ వెనుకా చూసుకోకుండా అడుగేసి ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య ఇండియాలో నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా, రాజస్థాన్ లోని జోధ్ పూర్ నేషనల్ లా యూనివర్శిటీలో విద్యను అభ్యసిస్తున్న ప్రణీత మెహతా (21) అనే యువతి స్నేహితులతో కర్ణాటక పర్యటనకు వచ్చి సెల్ఫీ పిచ్చిలో నిండు జీవితాన్ని బలిచేసుకుంది. వివరాల్లోకి వెళితే, గోకర్ణ బీచ్ కు వచ్చిన వేళ, దాదాపు 300 అడుగుల ఎత్తయిన లైట్ హోస్ పైకి ఎక్కిన ప్రణీత, అక్కడ సెల్ఫీ దిగుతూ, కాలుజారి సముద్రంలో పడిపోయింది. దీన్ని గమనించిన జాలర్లు ప్రణీతను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఆమె దేహాన్ని మాత్రమే బయటకు తేగలిగారు. ముంబై, గోవాలను తిరిగిన వీరి బృందం విహారయాత్ర కన్నడనాట విషాదాంతం కావడం, సెల్ఫీల మోజు కారణంగా ఇండియాలో మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

More Telugu News