శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న చంద్రబాబు మనవడు దేవాన్ష్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న చంద్రబాబు మనవడు దేవాన్ష్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబసభ్యులు ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కొడుకు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఆలయానికి చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు వేదాశీర్వచనం చేశారు. అంతకుముందు, ఉదయం పదిగంటలకు పద్మావతినగర్ కు చేరుకుని లోకేశ్ కుమారుడు దేవాన్ష్ తలనీలాలు సమర్పించారు.

More Telugu News