రూ.20 లక్షల విరాళమిచ్చిన చంద్రబాబు పాపాత్ముడా?: సీఎం వ్యాఖ్యలను తిప్పికొట్టిన స్వరూపానంద
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ సమావేశంలో ఇటీవల చేసిన వ్యాఖ్యలను విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తిప్పికొట్టారు. పాపాలు చేసిన వారు హుండీలో డబ్బులు వేస్తున్నారని, అందుకే హుండీ ఆదాయం పెరుగుతోందని చంద్రబాబు అనడం భావ్యం కాదని స్వరూపానంద వ్యాఖ్యానించారు. చంద్రబాబు కూడా తిరుమల వెంకన్నకి 20 లక్షల రూపాయల విరాళం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. మరి చంద్రబాబు కూడా పాపాత్ముడేనా..? అంటూ ఆయన నిలదీశారు. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల భూములపై ఆయన మాట్లాడుతూ.. ఏడు దేవాలయాలకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై హైకోర్టు మెట్లెక్కుతామన్నారు.