ప్రధాని మోదీకి సంచలన వీడియో పంపిన కేరళ విద్యార్థిని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రధాని మోదీకి సంచలన వీడియో పంపిన కేరళ విద్యార్థిని

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేరళలోని త్రిస్సూర్ జిల్లాకు చెందిన పదో తరగతి విద్యార్థిని ఆనీ రుబు జోషి (15) ఒక వీడియో పంపింది. తమది పేద కుటుంబమనో, తనకు ఆర్థిక సాయం చేయమనో...ఆ వీడియోలో ఆమె కోరలేదు. మన దేశంలో డ్రగ్ మాఫియా విస్తరించి వుంటే, ఇక దేశం ఎలా బాగుపడుతుందని 6 నిమిషాల నిడివి గల ఆ వీడియోలో ఆమె ప్రశ్నించింది. మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ఆనీ రుబు జోషి ఆంగ్లంలో మాట్లాడిన వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది. తీవ్రవాదం కన్నా మత్తుమందులు చాలా ప్రమాదకరమని, వాటిని నివారించే దిశగా తగు చర్యలు తీసుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నానని, దీనిపై ప్రధాని స్పందించాలని కోరుకుంటున్నానని ఆనీ పేర్కొంది. ఈ సందర్భంగా ఆనీ మరో విషయాన్ని కూడా చెప్పింది... లివర్ క్యాన్సర్ కారణంగా తన తండ్రిని పోగొట్టుకున్నానని, తన స్నేహితులు, సన్నిహితులతో కలిసి యాంటీ డ్రగ్ ఎడ్యుకేషన్ ఇనీషియేటివ్-ఫార్ట్యూన్ అనే ఒక వేదిక ద్వారా తాను పోరాటం చేస్తున్నానని మోదీకి పంపిన ఆ వీడియోలో తెలిపింది. మరి, మోదీజీ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి!

More Telugu News