దీక్షల పేరుతో ప్రజల్ని రెచ్చగొట్టవద్దు: జగన్కు మాణిక్య వరప్రసాద్ సూచన
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఎంతో కృషి చేస్తోందని, కేంద్రంతో కలిసిపని చేస్తూనే హోదా సాధిస్తామని టీడీపీ అధికార ప్రతినిధి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జగన్ దీక్షల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఆ ప్రయత్నాలను మానుకోవాలని మాణిక్యవరప్రాద్ సూచించారు. సున్నితమైన అంశాలను రాజకీయం చేయవద్దని ఆయన జగన్ను కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారని ఆయన తెలిపారు. ఏపీ అభివృద్ధికి ఉపయోగపడే ప్రత్యేక హోదా కోసం తమ ప్రయత్నాలు నిరంతరంగా కొనసాగుతూనే ఉంటాయని ఆయన చెప్పారు.