కన్నయ్య వివాదంలో భాగమై విధ్వంసం సృష్టించండి: భారత ఉగ్రవాదులకు ఐఎస్ఐఎస్ ఆదేశాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కన్నయ్య వివాదంలో భాగమై విధ్వంసం సృష్టించండి: భారత ఉగ్రవాదులకు ఐఎస్ఐఎస్ ఆదేశాలు

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో చెలరేగిన విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ వివాదంలోకి చొరబడాలని ఇక్కడి ఉగ్రవాదులకు ఇస్లామిక్ స్టేట్ సూచించినట్టు ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. దేశద్రోహ ఆరోపణలపై ఫిబ్రవరి 19న కన్నయ్య తీహార్ జైల్లో ఉన్న వేళ, పలు యూనివర్శిటీల విద్యార్థులు నిరసనలు చేపట్టారని, ఆ సమయంలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాది అహ్మద్ అలీ నుంచి ఇండియాకు ఆదేశాలు వచ్చాయని వివరించారు. పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీకి చెందిన ఆషిక్ అహ్మద్ (19)కు ఆదేశాలిస్తూ, ఉద్యమంలోకి వెళ్లి పెట్రోల్ వాడి వాహనాలకు నిప్పు పెట్టాలని సూచించాడని తెలిపారు. ఐఎస్ఐఎస్ అనుబంధ జునాద్ అల్ ఖలీఫా-ఏ-హింద్ సంస్థకు చెందిన ఆషిక్ అహ్మద్ అలియాస్ రాజా, మహమ్మద్ అబ్దుల్ అహద్, మహమ్మద్ అఫ్జల్ ల అరెస్టుతో ఈ విషయం తెలిసిందని ఎన్ఐఏకు చెందిన ఓ అధికారి తెలిపారు.

More Telugu News