ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థుల స‌స్పెన్ష‌న్‌పై హైకోర్టు స్టే... విద్యార్థుల దీక్ష విరమణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థుల స‌స్పెన్ష‌న్‌పై హైకోర్టు స్టే... విద్యార్థుల దీక్ష విరమణ

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు ఎట్ట‌కేల‌కు తాము గత 16 రోజులుగా చేస్తోన్న నిరాహార దీక్షను విర‌మించారు. ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరితీతను నిరసిస్తూ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 9న యూనివ‌ర్సిటీలో నిర్వ‌హించిన ర్యాలీలో స‌ద‌రు విద్యార్థులు చేసిన వ్యాఖ్య‌ల‌తో స్టూడెంట్ యూనియ‌న్ లీడ‌ర్ కన్నయ్యకుమార్ తో పాటు ప‌లు విద్యార్థుల‌పై క్రమశిక్షణ చర్యలు, జరిమానా విధించిన సంగ‌తి విధిత‌మే. త‌మ‌పై ప్రాథమిక విచారణ జరిగిన తీరుపై, తమను సస్పెండ్ చేయడంపై వ‌ర్సిటీ చ‌ర్య‌ను నిరసిస్తూ విద్యార్థులు 16రోజుల పాటు నిర‌శ‌న‌ను కొన‌సాగించారు. ఈ క్ర‌మంలో కొంద‌రు విద్యార్థుల ప‌రిస్థితి విష‌మంగా మార‌డంతో క‌న్న‌య్య స‌హా మ‌రో నలుగురు విద్యార్థులు కొన్ని రోజుల ముందు దీక్ష‌ను విర‌మించారు. మ‌రో ప‌దిహేను మంది విద్యార్థులు నిర‌శ‌న‌ను కొన‌సాగించారు. అయితే ఈ విషయంపై విచారణ జ‌రిపిన‌ హైకోర్టు విద్యార్థుల స‌స్పెన్ష‌న్‌పై కండీష‌న‌ల్ స్టే విధించింది. హైకోర్టు నుంచి వర్సిటీకి ఆదేశాలు అందిన వెంటనే తాము నిరాహార దీక్ష‌ను, ఆందోళ‌న‌ను విర‌మిస్తున్న‌ట్లు విద్యార్థులు పేర్కొన్నారు.

More Telugu News