Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రైల్లో ఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులు, ఒకరి మృతి ... ఇన్సాస్ రైఫిళ్లను ఎత్తుకెళ్లిన దుండగులు... బీహార్లో 'జంగిల్ రాజ్'!

బీహార్ లో చట్టం సక్రమంగా అమలు కావడం లేదని చెప్పడానికి, 'జంగిల్ రాజ్' కొనసాగుతోందని చెప్పడానికి మరో ఉదాహరణ ఇది. ఓ రైలుపై ఆయుధాలతో దాడి చేసిన ఆరుగురు గుర్తు తెలియని దుండగులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) జవానుపై దాడి చేసి కాల్చి చంపి, ఇన్సాస్ తుపాకులను తీసుకెళ్లారు. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన మొఘల్ సరాయ్ నుంచి బుక్సర్ ప్రయాణించే పాసింజర్ రైలు (63420)లో జరిగింది. మరణించిన జవాన్ ను అభిషేక్ సింగ్ గా గుర్తించారు. ఘటనా స్థలిని ఈ ఉదయం సందర్శించిన రైల్వే ఎస్పీ జితేంద్ర మిశ్రా, నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. దాడి చేసిన వారు ప్రొఫెషనల్ నేరగాళ్లని, ఆయుధాల కోసమే దాడి చేశారని వివరించారు.

More Telugu News