ఎవరు ఎవరిని నిద్రపుచ్చారో చెప్పండి?: సమంత గురించి ఆమె స్నేహితురాలు అడిగిన ప్రశ్న
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎవరు ఎవరిని నిద్రపుచ్చారో చెప్పండి?: సమంత గురించి ఆమె స్నేహితురాలు అడిగిన ప్రశ్న

టాలీవుడ్ అగ్రనటి సమంత గురించి సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్టు చేసిన ఆమె స్నేహితురాలు నీరజ కోన ఆమె అభిమానులను ఓ ప్రశ్న వేశారు. పిల్లలంటే అమితమైన అభిమానం చూపించే సమంత, నీరజ కోన కుమారుడితో కలిసి ఆడుకుంది. ఆ క్రమంలో ఇద్దరూ నిద్రపోయారు. అయితే, ఎవరు ఎవరిని నిద్రపుచ్చారన్నదే అసలు ప్రశ్న...ఇంతకీ ఎవరు ఎవరిని నిద్రపుచ్చారంటారు? అంటూ అభిమానులను నీరజ ప్రశ్నించింది. దీనికి ఆమె అభిమానుల నుంచి విశేషమైన స్పందన లభించింది. కామెంట్లు, లైకులు, షేర్లతో సమంత అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

More Telugu News