Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంగారు తల్లి పథకం రద్దు... టీసర్కార్ ఉత్తర్వులు

ఇద్దరు ఆడపిల్లలు ఉన్న కుటుంబాలకు వర్తించే 'బంగారు తల్లి' పథకాన్ని సమైక్య రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాడు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్య లక్ష్మి పథకాల కింద ఆడపిల్లల కోసం కోట్లు ఖర్చు చేస్తున్నామని, బంగారు తల్లి పథకం అవసరం లేదని టీ ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.

More Telugu News