Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈనెల 15న‌ ఎంసెట్‌ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాం.. నీట్ ద్వారానే మెడిక‌ల్ కోర్సుల్లో ప్ర‌వేశాలు: టీఎస్ ఎంసెట్ క‌న్వీన‌ర్‌

ఈనెల 15న నిర్వ‌హించ‌నున్న తెలంగాణ ఎంసెట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామ‌ని రాష్ట్ర‌ ఎంసెట్ క‌న్వీన‌ర్ రమణారావు మీడియాకు తెలిపారు. విద్యార్థులు గంట ముందుగానే ప‌రీక్ష హాలుకి రావాలని, ఆల‌స్యంగా వ‌స్తే ప‌రీక్ష‌కు అనుమ‌తించ‌బోమ‌ని ఆయ‌న తెలిపారు. ప‌రీక్ష‌కు బ‌స్సుల్లో హాజ‌ర‌య్యే విద్యార్థుల కోసం ఆర్టీసీని అల‌ర్ట్ చేశామ‌ని పేర్కొన్నారు. ఎంబీబీఎస్‌, బీడీఎస్ కోర్సుల్లో ప్ర‌వేశాలు నీట్‌ ద్వారానే జరుగుతాయని ఆయ‌న‌ స్పష్టం చేశారు. మిగతా కోర్సులకు మాత్రం ఎంసెట్ ద్వారా ప్రవేశాలు ఉంటాయన్నారు. ప‌రీక్ష నిర్వ‌హించిన రోజే ప్రిలిమినరీ కీని విడుదల చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు.

More Telugu News