Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కీపర్ ను వికెట్ తో పొడిచి చంపేసిన బ్యాట్స్ మన్

క్రికెట్ లో స్లెడ్జింగ్ (దూషణ) అనేది సర్వసాధారణం. అయితే ఈ స్లెడ్జింగ్ హద్దులు మీరితే ఎలాంటి ప్రతి ఫలాన్నిస్తాయన్నది బంగ్లాదేశ్ లో జరిగిన ఈ ఘటన తెలిపింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఓ దేశవాళీ మ్యాచ్ లో ఘోరం చోటుచేసుకుంది. ఢాకా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో బాబుల్ సిక్దర్ అనే వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ 'అవుట్' అంటూ అప్పీలు చేయడం బ్యాట్స్ మన్ కు విసుగుతెప్పించింది. అయితే నో బాల్ కు కూడా అప్పీలు చేయడాన్ని ఆ బ్యాట్స్ మన్ భరించలేకపోయాడు. కేవలం తనను రెచ్చగొట్టేందుకే సిక్దర్ అలా అప్పీలు చేస్తున్నాడన్న ఆగ్రహంతో వికెట్ ను పీకి అతని మెడపై పొడిచేశాడు. మొనదేలి ఉన్న వికెట్ అతని మెడలో దిగబడడంతో కీపర్ అక్కడికక్కడే కుప్పకూలాడు. అతనిని సహచర ఆటగాళ్లు ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బ్యాట్స్ మన్ పరారీలో ఉన్నాడు.

More Telugu News