Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆర్టీసీ ప్రయాణికుల కోసం కొత్త యాప్... ఎన్ని లాభాలో!

తమ బస్సుల్లో ప్రయాణించే వారికి మరింత లాభాన్ని దగ్గర చేయాలన్న ఉద్దేశంతో ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త యాప్ ను సిద్ధం చేసింది. ఈ యాప్ ఉంటే, పలు రాయితీలను, లాభాలను పొందవచ్చని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా స్మార్ట్ ఫోన్ వాడకందారులకు అందుబాటులోకి రానున్న యాప్ ను డౌన్ లోడ్ చేసుకుంటే, తొలి రెండు టికెట్లపై రూ. 50 చొప్పున రూ. 100 ఆదా అవుతుంది. టికెట్ల బుకింగ్, రద్దు, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ఆధారంగా బస్సు ఎక్కడుందో తెలుసుకోవడం, ఎం-వాలెట్ సదుపాయాలూ ఉంటాయని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. ఇక బ్యాంకు ఖాతా నుంచి ఆర్టీసీ ఎం-వాలెట్ లోకి డబ్బు జమ చేసినప్పుడు, బ్యాంకు విధించే సర్వీస్ చార్జ్ ని ఆర్టీసీయే భరించే ప్రతిపాదన ఉందని వివరించారు. ఇతర మార్గాల్లో టికెట్ ను రద్దు చేసుకుంటే ప్రయాణ కాల సమయం ఎంత దూరంలో ఉందన్న విషయాన్ని బట్టి రద్దు చార్జీలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే ఎప్పుడు రద్దు చేసుకున్నా, కేవలం రిజర్వేషన్ చార్జీలను మాత్రమే కట్ చేసుకుని మిగిలిన మొత్తమంతా చెల్లిస్తామని తెలిపారు.

More Telugu News