డిసెంబ‌రు 31 డెడ్‌లైన్.. సుప్రీం ఆదేశాల కోసం ఎదురుచూడ‌బోం: అయోధ్యలో రామ మందిరంపై వీహెచ్‌పీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డిసెంబ‌రు 31 డెడ్‌లైన్.. సుప్రీం ఆదేశాల కోసం ఎదురుచూడ‌బోం: అయోధ్యలో రామ మందిరంపై వీహెచ్‌పీ

అయోధ్యలో రామ‌మందిర నిర్మాణానికి విశ్వ‌హిందూ ప‌రిష‌త్ డెడ్‌లైన్ పెట్టింది. మందిర నిర్మాణ ప‌నులు డిసెంబ‌రు 31లోగా ప్రారంభం కావాల్సిందేన‌ని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల కోసం తామింకా ఎదురుచూడ‌బోమ‌ని ఇండోర్ లో జ‌రిగిన ఓ స‌భ‌లో వీహెచ్ పీ కార్య‌ద‌ర్శి చంప‌త్ రాయి తెలిపారు. డిసెంబ‌రు వ‌ర‌కు ఓపిక ప‌ట్టి చూస్తామ‌ని, ఆ త‌రువాత రామ మందిర నిర్మాణం అంశంపై సహనంతో ఉండలేమని తెలిపారు. న‌వంబ‌రు 1 నుంచి రామ‌మందిర నిర్మాణం ప్రారంభం కాబోతుంద‌ని ప్ర‌చారమ‌వుతోన్న వ్యాఖ్య‌లను ఆయ‌న ఖండించారు. ప‌లు సంస్థ‌లు అయోద్య రామ‌ మందిర నిర్మాణ వివాదంపై స్పందిస్తూ అటువంటి ప్ర‌చారం చేస్తున్నాయ‌ని అన్నారు.

More Telugu News