Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్నేక్ గ్యాంక్ నిందితుల్లో ఏడుగురికి యావజ్జీవ ఖైదు

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ కేసులో కోర్టు తీర్పు వెలువడింది. కేసులో నిందితులుగా నిర్ధారణ అయిన ఎనిమిది మందిలో ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తున్నట్టు రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పిచ్చారు. వీరంతా తమ చేష్టలతో సమాజంలో ఉండే అర్హతను కోల్పోయారని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ-8గా ఉన్న నిందితుడికి 20 నెలల జైలుశిక్ష విధిస్తున్నట్టు తెలిపారు. వీరి నేరాలు తీవ్రమైనవని, అభియోగాలు తనకు దిగ్బ్రాంతిని కలిగించాయని, లైంగిక వేధింపుల ఆరోపణలు రుజువు కానప్పటికీ, స్వల్ప శిక్షకు వీరు అనర్హులని అన్నారు. కాగా, హైదరాబాద్ శివార్లలో కనిపించే జంటలకు పాములు చూపించి అత్యాచారాలు, దోపిడీలు చేసినట్టుగా వీరిపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరి అత్యాచారాలను నిరూపించేందుకు సరైన సాక్ష్యాలు లభించకపోగా, దోపిడీ, భయభ్రాంతులను చేయడం వంటి ఆరోపణలు రుజువయ్యాయి. మొత్తం 9 మందిపై చార్జ్ షీట్ దాఖలు కాగా, 8 మందిపై అభియోగాలు నిరూపితమయ్యాయి.

More Telugu News